Anil Ravipudi : అనిల్ రావిపూడికి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో?

New Update
Anil Ravipudi : అనిల్ రావిపూడికి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో?

Ram Charan Warning To Anil Ravipudi : ప్రెజెంట్ టాలీవుడ్ లో అప్ కమింగ్ డైరెక్టర్స్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయమే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన గత ఏడాది 'భగవంత్ కేసరి' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడికి ఓ స్టార్ హీరో వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఎందుకని వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..

అనిల్ రావిపూడి రామ్ చరణ్ వార్నింగ్

2019 సంక్రాంతికి రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో 'వినయ విధేయ రామ్' ప్లాప్ అవ్వగా.. 'ఎఫ్ 2' సూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వకముందు రామ్ చరణ్, అనిల్ రావిపూడి ఇద్దరూ ఓ ఈవెంట్ లో కలుసుకున్నారట. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ అనిల్ తో "నువ్వు నా సినిమాకే పోటీగా నీ సినిమా రిలీజ్ చేస్తావా?" అంటూ గట్టిగా నిలదీశాడట. దాంతో అనిల్ రావిపూడి ఒక్కసారిగా షాక్ అయ్యాడట.

Also Read : ‘సలార్- 2’ లో మరో పాన్ ఇండియా హీరో.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న ప్రశాంత్ నీల్?

ఆ తర్వాత రామ్ చరణ్ అనిల్ రావిపూడిని హగ్ చేసుకొని నీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారట. అప్పటిదాకా షాక్ లో ఉన్న అనిల్ చరణ్ హగ్ చేసుకోగానే ఊపిరి పీల్చుకున్నాడట. ఈ సంఘటన గతంలో జరిగినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మరి రాబోయే రోజుల్లో రామ్ చరణ్, అనిల్ రావిపూడి కలిసి సినిమా చేస్తారేమో చూడాలి. ఇక అనిల్ రావిపూడి - వెంకటేష్ మూవీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు