AP: బుర్రుందా..ఏం మాట్లాడుతున్నారు..నేతలపై చంద్రబాబు సీరియస్
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు.
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రితో ముగియనున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10న వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. అర్థరాత్రి 12 గంటలకు ఏకాంత సేవతో తలుపులను మూయనున్నారు. మళ్లీ డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారాలు తెరుచుకుంటాయి.
వైసీపీ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని ఎవరూ పార్టీ విడిచి వెళ్లవద్దని శ్రీ రెడ్డి కోరింది. ప్లీజ్ కాస్త ఓపికతో అందరూ ఉండి.. జగన్ అన్నకు సపోర్ట్ చేయండని తెలిపింది. పార్టీలో యాక్టివ్‌గా లేకపోయినా.. కనీసం సైలెంట్‌గా అయినా పార్టీలో ఉండండని కోరింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపింది. మధ్యాహ్నం 1:30 PM గంటల నుంచి 1:50 గంటల వరకు డ్రోన్ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజులు పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు. ఆదివారం గన్నవరంలో NDRF, SDRF క్యాంపులను ఆయన ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని గట్టెంకించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మొదటి అంతస్తు నుంచి మూడేళ్ల బాలుడు కింద పడి మృతి చెందిన విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కడప జిల్లాకి చెందిన ఓ కుటుంబం దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. పద్మనాభ నిలయం దగ్గర మూడేళ్ల బాలుడు ఆడుతూ ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడ్డి మృతి చెందాడు.