/rtv/media/media_files/2025/01/18/vqvX7ilczoaNKOXWRppb.jpg)
Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపింది. 20 నిమిషాల పాటు ఆఫీసుపై డ్రోన్ చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 1:30 PM గంటల నుంచి 1:50 గంటల వరకు డ్రోన్ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మంగళగిరిలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి క్యాంపు కార్యాలయం, నిర్మాణంలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయ భవనంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ విషయాన్ని క్యాంపు కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. పోలీసు విచారణ ప్రారంభమైంది. pic.twitter.com/yWjVMtL387
— JanaSena Party (@JanaSenaParty) January 18, 2025
గతంలో పవన్ కల్యాణ్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఫేక్ ఐపీఎస్ బయటపడటం సంచలనం రేపింది. మరోసారి ఆగంతకుడి నుంచి పవన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.