నెవ్వర్ బిఫోర్.. అమరావతిలో అదిరిపోయే డ్రోన్ షో-LIVE
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఏపీ ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. డ్రోన్ సాంకేతికత వినియోగం, ఎదురయ్యే సవాళ్లపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. దేశంలోని దాదాపు అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, తయారీ నిపుణులు హాజరుకానున్నారు.
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
AP: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈరోజు ముళ్లకంపల తొలగింపును ప్రారంభించనున్నారు మంత్రి నారాయణ.
AP: రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే.
AP: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది.భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని చెప్పారు.