3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
AP: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈరోజు ముళ్లకంపల తొలగింపును ప్రారంభించనున్నారు మంత్రి నారాయణ.
AP: రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే.
AP: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది.భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని చెప్పారు.
AP: ఈరోజు రాజధానికి ఐఐటీ నిపుణులు వెళ్లనున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల క్వాలిటీని ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ఏపీ సర్కార్.
అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి.
ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు.