Basavatarakam Hospital: అమరావతికి బాలయ్య గుడ్ న్యూస్ !

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని  తెలిపారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రి ప్రారంభిస్తామని, అందుబాటు ధరల్లోనే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.  

New Update
balakrishna, amaravati
Basavatarakam Hospital: ఏపీలోని అమరావతి(Amaravati)కి సినీ నటుడు, హిందూపురం(Hindupur) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) గుడ్ న్యూస్ చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి(Basavatarakam Indo American Cancer Hospital) ద్వారా మరిన్ని సేవలు చేస్తానని  తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రి ప్రారంభిస్తామని వెల్లడించారు.  2025 ఫిబ్రవరి 15వ తేదీన హైదరాబాద్ క్యాన్సర్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభం అనంతరం బాలకృష్ణ  మీడియాతో మాట్లాడారు. పేదలకు అందుబాటు ధరల్లోనే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.  

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

మనోధైర్యంతో ఉంటే

పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.  క్యాన్సర్‌(Cancer)తో ఎంతోమంది బాధపడుతున్నారని చెప్పిన బాలయ్య..  క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని, ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అని తెలిపారు. 

మరోవైపు అమరావతిలో గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు చంద్రబాబు  ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో వారితో చేసుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోవడం, ఇందులో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు అధికారుల స్ధాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేందుకు గతంలో బాలయ్య అంగీకరించారు. 

Also Read :  విశాఖ వసంత కేసులో బిగ్ ట్విస్ట్..పోలీసులకు దిమ్మతిరిగే షాక్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు