Producer Allu Aravind: బండ్ల గణేష్ వ్యాఖ్యలకు నిర్మాత అల్లు అరవింద్ మాస్ కౌంటర్..!

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల కూడా ఆయన అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.

New Update
Producer Allu Aravind

Producer Allu Aravind

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల కూడా ఆయన అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించడం తన స్థాయి కాదని ఊరమాస్ కౌంటర్ ఇచ్చారు. దీంతో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Allu Aravind mass counter

కొద్ది రోజుల క్రితం.. అంటే ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ పాల్గొని.. నిర్మాత అల్లు అరవింద్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎన్నో వందల కోట్ల మందిలో ఎవరో ఒకరికి అన్నీ దక్కుతాయి. ఒక స్టార్ కమెడియన్‌కి కొడుకుగా పుడతాడు. ఒక మెగాస్టార్ బామ్మర్దిగా, ఒక ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటాడు. ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. జీవితంలో అంత మహర్జాతకుడ్ని తాను చూడలేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణ పార్టనర్‌ బన్నీ వాసు ఎంత కష్టపడ్డా.. చివర్లో అల్లు అరవింద్ వచ్చి ఆ క్రెడిట్ మొత్తం కొట్టేస్తారు. ఆయన జాతకం అలాంటిది అని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 

అల్లు అరవింద్ కౌంటర్

ఇందులో భాగంగా.. తాజాగా రష్మిక మందన్నా నటించిన ‘ది గర్లఫ్రెండ్’ మూవీ ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ పాల్గొనగా.. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై నిర్మాత అల్లు అరవింద్‌ నవ్వుతూ.. చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. ఆ విషయం గురించి తాను మాట్లాడను అని అన్నారు. తనకంటూ ఒక స్థాయి ఉందని.. అందువల్ల తాను అలాంటి వాటికి సమాధానం చెప్పాలనుకోవడం లేదని అల్లు అరవింద్ అన్నారు.

దీంతో బండ్ల గణేష్ వ్యాఖ్యలకు అల్లు అరవింద్ ఒక్క వాఖ్యంలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారని అభిమానులు, సినీ ప్రేక్షకులు, సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీనియర్ నిర్మాత స్థాయిలో ఉన్న అల్లు అరవింద్.. ఆ వ్యాఖ్యలపై మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో ఆయన స్థాయేంటో అర్థం చేసుకోవచ్చని పలువురు ప్రశంసిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు