/rtv/media/media_files/2025/08/30/allu-arjun-chiranjeevi-2025-08-30-14-22-45.jpg)
allu arjun - Chiranjeevi
Allu Aravind Mother Passed Away: అల్లు రామలింగయ్య సతీమణీ, అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాయనమ్మ, చిరంజీవి అత్తగారు, రామ చరణ్ అమ్మమ్మ అల్లు కనకరత్నమ్మ వ్యధాప్య సమస్యలతో ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, సినీ ప్రముఖులుకనకరత్నమ్మ చివరి చూపు చూసుకోవడానికి అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. అల్లు అరవింద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
అమ్మమ్మకు కడసారి వీడ్కోలు పలకడానికి మావయ్య ఇంటికి చేరుకున్న #RamCharan, అమ్మ, మావయ్య , బన్నీ లను ఓదార్చి అమ్మమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు.#RamCharan#AlluArjun#AlluKanakaRatnamma#RTVpic.twitter.com/QCaZU9WTz4
— RTV (@RTVnewsnetwork) August 30, 2025
'బలగం' సీన్ రిపీట్
ప్రస్తుతం షూటింగ్ లో భాగంగా మైసూర్ లో ఉన్న రామ్ చరణ్ అమ్మమ్మ మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. చరణ్ కారు దిగగాగే బన్నీని చూసి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. బన్నీని, మావయ్య అల్లు అరవింద్ హత్తుకొని ఓదార్చాడు. బన్నీ కూడా చరణ్ చూసి బాగా ఎమోషనల్ అయ్యారు. కనకరత్నమ్మ బన్నీకి నాయనమ్మ, అలాగే చరణ్ కి అమ్మమ్మ! దీంతో ఇద్దరు మనవళ్ళు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు చిరంజీవి బావ అల్లు అరవింద్, అల్లుడు బన్నీని ఓదార్చడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ఇది చూసిన అభిమానులు 'బలగం' సీన్ రిపీట్ అని కామెంట్లు పెడుతున్నారు.
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిని ఓదారుస్తున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా..#allusnehareddy#allukanakaratnam#allukanakaratnamma#alluarjunonline#rtvpic.twitter.com/63BsEUUEy4
— RTV (@RTVnewsnetwork) August 30, 2025
'బలగం' సినిమాలో కూడా మనస్పర్థలతో దూరమైనా బావ బామ్మర్దులు తండ్రి చనిపోయిన సమయంలో ఒకరికొకరు ఓదార్పుగా నిలుస్తారు. ఇప్పుడు మెగా- అల్లు ఫ్యామిలీలో కూడానా ఇదే రిపీట్ అయ్యిందని అంటున్నారు నెటిజన్లు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా ప్రచారం చేయడం అల్లు- మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చు రేపిందని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సరిగ్గా మాటలు లేవని టాక్.
ఇదిలా అల్లు అర్జున్ కి తన నాయనమ్మ, తాతయ్యలు అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన నానమ్మ ఎంతో దిగులు చెందారు. మనవడు ఇంటికి రాగానే.. ఆ వయసులో కూడా తానే బన్నీకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. అయితే గత కొద్ది రోజులుగా కనకరత్నమ్మ వయోభారం సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రిలో కూడా చేర్పించినట్లు సమాచారం. ఇంతలోనే ఆమె తుది శ్వాస విడిచారు. కనకరత్నమ్మ 94 ఏళ్ళ వయసులో ప్రాణాలు విడిచారు.