Pushpa 2 Stampede : అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్‌...పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చడం గమనార్హం.

New Update
ALLU ARJUN

Pushpa 2 Stampede

Pushpa 2 Stampede : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చడం గమనార్హం. కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా చేర్చారు. ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.  

ఆ రోజు ఏం జరిగిందంటే ?

2024 డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల సమయంలో పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌తో పాటు బృందం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రేవతి(35) అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్‌ చేశారు. అనంతరం హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతిచెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా మారటంతో నిమ్స్‌కు తరలించారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌..

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్‌ వేశారు. ప్రీమియర్ షో చూడ్డానికి హైదరాబాద్‌కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిస లాటలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. జైలులో కూడా ఉన్నారు.

మెరుగుపడని ఆరోగ్యం

కాగా, ప్రమాదం జరిగి ఏడాది అయినా కూడా నేటికి శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పటికీ మాట్లాడలేని, నడవలేని స్థితలోనే ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక, శ్రీ తేజ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు.. భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవటానికి 2 కోట్ల రూపాయలు అకౌంట్‌లో డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.  

Advertisment
తాజా కథనాలు