సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. DCM, మూడు బస్సులు ఢీ!
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న డీసీఎం, మూడు బస్సులు ఆకుపాముల వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కి కాలు విరగ్గా.. బస్సులోని చిన్నారికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఘోర ప్రమాదం.. 23 మంది దుర్మరణం
థాయ్‌లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ ట్రిప్‌కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి మంటలు చేలరేగడంతో 23 మంది మంటల్లో దుర్మరణం చెందారు. ఈ బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తుండగా 38 విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఉన్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బస్సు ఢీకొని 40 మంది..
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సర్కారు తోపు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. 40 మందికి తీవ్ర గాయాలవగా క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలువురికి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లో 9 మంది మృతి!
మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది.
Accident: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.
గుజరాత్ రోడ్డు ప్రమాదం.. ఖమ్మం స్టూడెంట్ మృతి!
గుజరాత్లో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఖమ్మం జిల్లాకి చెందిన కంచర్ల సంపత్ మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుజరాత్ కు తరలివెళ్లారు.
TG News: చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
వనపర్తి జిల్లాలోని కొత్తపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. హై స్పీడ్ కారణంగా అదుపుతప్పిన కారు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.