Road Accident: ఘోర ప్రమాదం.. స్పీడ్ బ్రేకర్‌ను ఢీ కొట్టి నలుగురు..

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబ వాహనంలో వేడుకకు వెళ్తుండగా.. మధ్యంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్‌లో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు.

New Update
accident (1)1

బిహార్‌లోని అర్వార్ జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మహీంద్రా స్కార్పియోలో వెళ్తుండగా.. మార్గ మధ్యలో వాహనం ఓ చిన్న స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టింది.

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

వాహనం అదుపు తప్పి..

దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వెహికల్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న కెనాలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే గాయపడిన వారిన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీలో కర్నూలులో ఓ వివాహ వేడుకలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం గ్రామంలో పెళ్లయిన తర్వాత ఉరేగింపు నిర్వహిస్తుండగా డీజే వాహనం కింద పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన దారుణ ఘటన జరిగింది. సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన ఆర్లబండ నాగేష్ కొడుకు బసవరాజుకి బుధవారం ఉదయం వివాహం జరిగింది.

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్

ఈ క్రమంలో ఆ రోజు రాత్రి గ్రామంలో ఉరేగింపు నిర్వహించగా.. డీజే వాహనం అదుపుతప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడేళ్ల బాలుడు చనిపోయాడు. వెనుక వైపు నుంచి బాలుడి తలభాగంపై వాహనం వెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు చావును తట్టుకోలేక కుటుంబ సభ్యులు పెళ్లి వాహనాలను ధ్వంసం చేశారు.

ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు