BIG BREAKING: టీడీపీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పెను ప్రమాదం తప్పింది. ఓ హాస్పటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే.. లిఫ్ట్ మొరాయించడంతో అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. అతికష్టం మీద ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యేను బయటకు తీసుకువచ్చారు.

New Update
TDP MLA Venigandla Ramu

టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రమాదం తప్పింది. ఈ రోజు గుడివాడలో ఆర్కా హాస్పటల్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పటల్ లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ మొరాయించింది. దీంతో ఎమ్మెల్యే దాదాపు అరగంట పాటు ఆయన లిఫ్ట్ లోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా!

మరో వైపు లిఫ్ట్ లో ఉన్న ఎమ్మెల్యే, ఇతర నేతలు సైతం ఇబ్బంది పడ్డారు. హాస్పటల్ సిబ్బంది అరగంట సేపు శ్రమించి అతి కష్టం మీద లిఫ్ట్ డోర్ తెరవడంతో.. ఎమ్మెల్యే, ఇతర నేతలు బయటకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకు ఆస్పత్రి నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.  
ఇది కూడా చదవండి: AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఆస్పత్రి ప్రారంభం రోజే అపశృతి..

ఆస్పత్రి ప్రారంభం రోజు అపశృతి చోటు చేసుకోవడం గుడివాడలో చర్చనీయాంశమైంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఇంత అజాగ్రత్తగా వ్యవహరించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. తనకు ఎలాంటి ఇబ్బంది కాలేదని చెప్పారు. ఎవరూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు