Paris Olympics: ఒలింపిక్స్‌కు ప్రత్యేకమైన గూగుల్ డూడుల్
పారిస్ ఒలింపిక్స్ కోసం గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను తయారు చేసింది. దాంతో పాటూ యూజర్లు డూడుల్ మీద క్లిక్ చేయగానే ఒలింపిక్స్ కు సంబంధించిన అప్డేట్లు వచ్చేలా పేజీలను డిజైన్ చేసింది.
పారిస్ ఒలింపిక్స్ కోసం గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను తయారు చేసింది. దాంతో పాటూ యూజర్లు డూడుల్ మీద క్లిక్ చేయగానే ఒలింపిక్స్ కు సంబంధించిన అప్డేట్లు వచ్చేలా పేజీలను డిజైన్ చేసింది.
ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్న క్రీడాకారుల్లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ కూడా ఉన్నారు. బాక్సింగ్ లో తన సత్తా చాటుకోవడానికి ఉవ్విళూరుతున్న నిఖత్‌కు కఠిన డ్రా లభించింది.
కన్నులపండుగా జరిగిన పారిస్ ఒలిపింక్స్ ప్రారంభ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫోటోలు మీ కోసం...
ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలతో అగ్రస్థానంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రియోలో రజతం, టోక్యోలో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ షట్లర్ మూడో పతకం కోసం గత కొన్నాళ్లుగా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తోంది.
అందరూ తెగ ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు రిబ్బన్ కటింగ్ అయింది. ఒలిపింక్స్ చరిత్రలోనే మొదటిసారిగా స్టేడియంలో కాకుండా బయట సీన్ నది ఒడ్డను ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తున్నారు.
మరికాసేపట్లో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు...భారత కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంటకు ఇది ప్రారంభం అవుతుంది. అయితే సీన్ నదిలో నిర్వహిస్తున్న ఒలింపిక్స్ పరేడ్‌ను వాన గండం ఉందని చెబుతున్నారు.
పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించగా ఈసారి కూడా ఎక్కవగా సాధించాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఒలింపిక్స్ సన్నాహకాల కోసం దాదాపు రూ.470 కోట్లు ఖర్చు చేసింది.
ఒలింపిక్స్‌ను ప్రతీ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని కోసం క్రీడాకారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇండియా కూడా ఒలింపిక్ కోసం ప్రతీసారి కోట్లు ఖర్చు పెడుతుంది. ఈసారి పారిస్‌లో జరుగుతున్న ఈ విశ్వ పోటీలకు భారత ప్రభుత్వం 417 కోట్లను ఖర్చు చేసింది.
పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా, చరిత్రకు విరుద్ధంగా ఈసారి స్టేడియం లోపల కాకుండా ఈ వేడుకలను బయట నిర్వహిస్తున్నారు. సీన్ నది ఒడ్డున ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.