Opening cermony: పారిస్ ఒలింపిక్స్…ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఈ విశ్వ ఆటల పోటీలు ఈరోజే మొదలవనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల క్రీడాకారులు పారిస్‌కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 7.30గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను గ్రాండ్‌గా చేయడానికి ఏర్పాట్లు చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అయితే ఈసారి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ ఎప్పటిలా స్టేడియం లోపల కాకుండా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో నిర్వహించున్నారు.
పూర్తిగా చదవండి..Paris Olympics: వెరైటీగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..నదిలో పరేడ్
పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా, చరిత్రకు విరుద్ధంగా ఈసారి స్టేడియం లోపల కాకుండా ఈ వేడుకలను బయట నిర్వహిస్తున్నారు. సీన్ నది ఒడ్డున ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.
Translate this News: