108 సర్వీసులకు గడ్డుకాలం.. డీజిల్ కు డబ్బుల్లేక నిలిచిన సేవలు!

ఏపీలో అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయని, అధికారులను ప్రశ్నిస్తే డీజిల్ కు డబ్బుల్లేక నిలిపి వేసినట్లు చెబుతున్నారని వాపోతున్నారు.

New Update
fdfere

AP news: పేద ప్రజలకు సంజీవదాయనిగా ఉన్న అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయని, ఏలూరు జిల్లాలో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న 29 అంబులెన్స్ సర్వీసులుండగా.. ప్రస్తుతం దాదాపు 10 సర్వీసులు అధికారులు నిలిపేశారంటూ ఆదేవన చెందుతున్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం భీమడోలు, ఆగిరిపల్లి, ఉంగుటూరు, చాట్రాయి మండలాల్లో అంబులెన్స్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయినట్లు చెబుతున్నారు. 

Also Read: Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

డీజిల్ కు డబ్బుల్లేక..

అయితే దీనిపై అధికారులను అడిగితే డీజిల్ కు డబ్బుల్లేక అంబులెన్స్ సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు చెబుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం రావడంతో 108 సర్వీస్ లు తగ్గిపోయాయని, జిల్లాలో అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అంబులెన్స్ సర్వీసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల

 

Also Read: వాలంటీర్లకు బిగ్‌ షాక్‌...డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు