Varun- Lavanya: టాలీవుడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మిస్టర్ సినిమాతో ఏర్పడిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. గతేడాది నవంబర్ 1 కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. లావణ్య, వరుణ్ జంట మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. క్యూట్ కపుల్ అంటూ ప్రశంసలు కురిపించారు.
లావణ్యను ప్రేమించకపోతే వరుణ్ పెళ్లి తనతో అయ్యేది
అయితే తాజాగా వీరి వివాహానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరలవుతోంది. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని ప్రేమించకపోతే, ఓ అగ్ర హీరో కుమార్తెను మెగా కోడలిగా చేసుకుందామనుకున్నారట నాగా బాబు. దీని కోసం ముందే సంబంధాన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకున్నారట. వరుణ్ సెట్ అయిన తర్వాత మరో సారి మాట్లాడి వివాహం చేద్దామని అనుకున్నారట. కానీ ఇంతలో వరుణ్ తన ప్రేమ విషయం చెప్పారట. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ప్రస్తుతం వరుణ్, లావణ్య ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇటీవలే లావణ్య నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ సీరీస్, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక వరుణ్ తన నెక్స్ట్ సినిమాను కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. మట్కా అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం 1958, 1982 లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Allu Arjun: తొలి సౌత్ ఇండియన్ హీరోగా బన్నీ రికార్డు.. ఏకంగా 25 మిలియన్ ఫాలోవర్స్..!