Varun Tej: బర్త్ డే రోజు కొత్త సినిమా అనౌన్స్ చేసిన మెగాహీరో.. ఈసారి కొరియన్ హారర్ థ్రిల్లర్ తో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే రోజున తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మూవీ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకుడు. 'VT15' పేరుతో తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు.

New Update
varun tej new movie vt15

varun tej vt15

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మట్కా' అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ మూవీ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ చేసింది. అయితే నేడు వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చింది.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'VT 15' అనే వర్కింగ్ టైటిల్ తో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో డ్రాగన్ డిజైన్‌తో కూడిన కోడ్‌ లాంగ్వేజ్ క్లాత్ మంటలతో అనుమానాస్పదంగా కనిపిస్తోంది. సస్పెన్స్, హాస్యం కలగలిసిన కథాంశంతో సినిమా ఉండబోతుందనే ఫస్ట్ లుక్ తోనే చెప్పేసారు. "వేట హాస్యాస్పదమైతే?" అనే క్యాప్షన్ ఈ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెంచింది.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!

ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ వంటి విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ డైరెక్షన్ కావడంతో ఈ ఈ మూవీలో సస్పెన్స్ తో పాటూ ఎంటర్టైన్మెంట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతోంది.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి నిర్మిస్తోంది. నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హార్రర్ కామెడీ చిత్రాలకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో 'VT15' ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ కు కంబ్యాక్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు