BIG BOSS 8: బిగ్ బాస్ స్టేజ్ పై మెగా హీరో సందడి.. నవ్వులే నవ్వులే..!
బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మెగా హీరో వరుణ్ తేజ్ 'మట్కా' ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసినట్లుగా చూపించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో ప్రేక్షకులలో షోపై మరింత ఆసక్తికరంగా పెరిగింది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. మట్కా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగా హీరో వరుణ్ తేజ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ప్రోమోలో లేడీ గెటప్స్ లో అవినాష్, టేస్టీ తేజ డాన్సులు, కామెడీ నవ్వులు పూయించాయి. హోస్ట్ నాగార్జున, వరుణ్ కూడా అవినాష్ కామెడీకి బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నాగార్జున.. వరుణ్ తో 'మట్కా' సినిమాకు సంబంధించిన విషయాలను మాట్లాడారు. 1960, 1970 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 'మట్కా' ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది ఇలా ఉంటే.. ఈ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని టాక్. ఈ వీక్ నిఖిల్ హరితేజ, విష్ణు ప్రియా, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ నామినేషన్స్ లో ఉండగా.. హరితేజ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణంగా గంగవ్వ కూడా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తవగా.. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ, మెహబూబ్, నయని పావని ఎలిమినేట్ అయ్యారు.