Poonam Kaur: నటి పూనమ్ కౌర్ మరోసారి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) లను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఎల్లప్పుడూ యాక్టివ్ ఉండే పూనమ్.. పవన్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ తో మరోసారి వాగ్వాదానికి దిగింది. ఆ గురూజీ కోరుకునే క్యారెక్టర్ తనది కాదని, ఆయనకు కావాల్సింది తన దగ్గర లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది.
ఈ మేరకు పూనమ్ పెట్టిన పోస్ట్ ప్రకారం.. ‘నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి బాగా తెలుసు. అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోలా గురించి కూడా తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెబుతున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నా. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి’ అంటూ చెప్పుకొచ్చింది. పూనమ్ వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘నీకు ఏం పని లేదు కదా అందుకే పదే పదే విమర్శలు చేసుకుంటూ వస్తావు’ అని ప్రశ్నించాడు. దీంతో ‘మీ లీడర్ స్త్రీలను ఎలా గౌరవిస్తాడో.. అతని అనుచరులు కూడా అలా గౌరవిస్తారు. ప్రతి రాజకీయ నాయడు లీడర్ కాలేడు’ అంటూ పరోక్షంగా పవన్ కు కౌంటర్ వేసింది.
Born to #shine 💎 pic.twitter.com/vXib31UAfp
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 11, 2024