/rtv/media/media_files/2025/05/21/SbdvaG7T1MfbOFhG0Acj.jpg)
poonam kaur allegations on trivikram
Poonam Kaur: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై కొంతకాలంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ మరో సంచలన పోస్ట్ చేసింది. గతంలోనే తాను త్రివిక్రమ్ పై MAA ఫిర్యాదు చేశానని.. అయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫిర్యాదు చేసినట్లు ఆధారాలను కూడా ఉన్నాయి అంటూ MAA మెంబర్ ఝాన్సీతో చేసిన చాటింగ్ స్క్రీన్ షార్ట్ లను బయటపెట్టింది.
నాతో ఆధారాలు ఉన్నాయి
పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూనమ్ ఇలా రాసుకొచ్చింది.. ఇది నేను ఇంతక ముందు చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. గతంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నేను ఈమెయిల్ ద్వారా MAA అసోషియేషన్ కి ఫిర్యాదు చేశాను. మొదట దీని గురించి ఝాన్సీతో మాట్లాడగా.. మీటింగ్ పెడదామని చెప్పారు. ఆ తర్వాత సడెన్ గా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అన్నారు. కొందరు ఫిర్యాదులో నేను పేర్లు చెప్పలేదని అంటున్నారు. కానీ నేను స్పష్టంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశాను. కొన్ని రాజకీయ శక్తులు, పరిశ్రమలోని పెద్దలు త్రివిక్రమ్ ని కాపాడుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/21/rizOaZ3bqBlyYi8vMwiD.jpg)
స్క్రీన్ షాట్ లో ఏం ఉంది
MAA మెంబర్ ఝాన్సీతో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ లో ఇలా ఉంది..మీ కోసం కమిటీ ఏర్పాటుచేస్తున్నాం. మహిళా న్యాయవాది వచ్చిన తరువాత మీరు మీ వివరాలను ఆ కమిటీకి చెప్పండి" అని పేర్కొంది.ఈ సంభాషణ 2018లో జరిగింది. కాగా, ఇప్పటివరకు 'మా' నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనిపై తాను మహిళా సంఘాలతో మాట్లాడతానని హెచ్చరించింది. అన్ని ఆధారాలు కమిటీ ఎదుట సమర్పిస్తాను.. త్రివిక్రమ్ ని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి లాగుతాను అని చెప్పారు. అయితే వీళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు.
telugu-news | cinema-news | poonam kaur about trivikram | trivikram