/rtv/media/media_files/6774cSUtKYNVRm8rqX4U.jpg)
సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టవ్ గా ఉంటూ సమస్యలపై నిలదీస్తుంది పంజాబీ నటి పూనమ్ కౌర్. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో క్రేజీ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఎక్కువగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తనకు పవన్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. తనను వాడుకుని అవకాశం ఇవ్వలేదనే వార్త ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.
ఇది కూడా చదవండిః రజినీ తర్వాత సమంతే తోపు.. త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్
అదే కారణంతో ఆమె పవన్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుందని గుసగుసలు కూడా వినిపించాయి. అయితే దీనిపై పవన్ కానీ, త్రివిక్రమ్ కానీ ఏ రోజూ మాట్లాడలేదు. అయితే రీసెంట్ గా ప్రముఖ నిర్మాత చిట్టిబాబు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. పూనమ్ కి పిచ్చి పట్టిందని.. ఆమెకు ఏదైనా అన్యాయం జరిగితే ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలి కానీ.. ఇలా లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఎందుకని అన్నాడు.
డైరెక్టర్ గర్భవతిని చేశాడు
అయితే దీనిపై స్పందించిన పూనమ్.. నిర్మాతపై ఫైర్ అయింది. తాను ఎప్పుడో ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశానని.. దాన్ని ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. మీకు త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా? అంటూ మండిపడింది. అయితే ఇది మరువక ముందే మరో ట్వీట్ తో పెద్ద బాంబ్ పేల్చింది. ఆమె చేసిన ట్వీట్ ఎవరిగురించి అనేది చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడని ట్వీట్ చేసింది.
''MAA'' జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందని చెప్తూ.. అతడు లీడర్ గా మారిన నటుడు కాదు అంటూ హింట్ ఇచ్చింది. ఈ విషయంలోకి తనను, ఓ నటుడు/రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ వాపోయింది. అయితే పేర్లు మాత్రం ప్రస్తావించకపోవడంతో పూనమ్ మళ్లీ త్రివిక్రమ్ పైనే ఆరోపణలు చేస్తోందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
clarification -
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 9, 2024
it’s not the actor turned politician who impregnated n aborted the girl which ended her career - it’s the director who did it -maa involvement helped the half punjabi actor , I and actor/politician were pulled unnecessarily due political desperation #punjabigirl.
Also Read : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు