/rtv/media/media_files/2025/06/12/vjhoQzLfDb3IhiMw4MyJ.jpg)
trivikram upcoming projects
Trivikram Projects: డైరెక్టర్ త్రివిక్రమ్ (director trivikram) అప్ కమింగ్ ప్రాజెక్టులపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్(trivikram) రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. చరణ్ కోసం ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని ప్రచారం జరిగింది. దీంతో తాజాగా నిర్మాత నాగ వంశీ.. ఈ వార్తలకు చెక్ పెడుతూ ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అందులో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెకులు ఉన్నాయని, అందులో ఒకటి వెంకటేష్, మరొకటి ఎన్టీఆర్ తో(ntr) చేస్తున్నారని తెలిపారు. ఇవి కాకుండా ఇతర హీరోల పేర్లతో వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేశారు. అలాగే త్రివిక్రమ్ కి సంబంధించి మరేదైనా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే తానే స్వయంగా వెల్లడిస్తానని నాగవంశీ తెలిపారు.
Also Read: Sandeep Reddy Vanga: అయ్యో వంగ.. అప్పుడు దీపిక .. ఇప్పుడు అల్లు అర్జున్ ఔట్!
Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.
— Naga Vamsi (@vamsi84) June 12, 2025
ఫ్యామిలీ ఎంటర్ టైనర్
ఇదిలా ఉంటే వెంకీ - త్రివిక్రమ్ (venky- trivikram) కాంబోలో రానున్న చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. గతంలో త్రివిక్రమ్.. వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరీ' వంటి హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించినప్పటికీ.. డైరెక్షన్ చేయలేదు. మొత్తానికి ఇంతకాలం తర్వాత వీరిద్దరి కాంబోకి ముహూర్తం కుదిరింది.
ఇక వెంకీమామ కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్న వెంకీమామ.. ఫైనల్ గా త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
Also Read: Gopichand33 Glimpse: గోపిచంద్ బర్త్‌డే స్పెషల్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్