Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) సవాల్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) చెప్పుకుంటుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు. దీనికి రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందా? అని ప్రశ్నించారు.
Telangana Assembly Session
Telangana Assembly: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly Sessions: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా (Rythu Bharosa) విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: రేవంత్ సర్కార్ సంచలనం.. వాళ్ళనుంచి రైతుబంధు సొమ్ము వెనక్కి..
అలాగే జాబ్ క్యాలెండర్ ను (Job Calendar) సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కానీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే సరికి బీఆర్ఎస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉంది. ఇంకా జాబ్ క్యాలెండర్, అమలు కానీ గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.
TS Assembly Session: మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు!
BRS MLA Harish Rao: శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు అని పేర్కొన్నారు. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని మండిపడ్డారు. సీఎం గురువు దగ్గర పనిచేసిన మోదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయని అన్నారు. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగాయంటూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!
హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ సొంత ఆదాయం ఎలా పెరిగిందన్నది చూపలేదు శ్వేతపత్రంలో పేర్కొనలేదని అన్నారు. ఆరోగ్యంపై తక్కువగా ఖర్చు పెట్టామనేది అవాస్తవం అని తేల్చి చెప్పారు. కరోనా (Coronavirus) వల్ల కేంద్రం ఎక్కువగా అప్పులు తీసుకునేలా చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పడిందని అన్నారు. అయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని పేర్కొన్నారు. కేంద్రంతో మా ఎంపీలు పోరాడారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో కేంద్రాన్ని ఎప్పుడూ అడగలేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు.
ALSO READ: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే!
పన్నుల్లో వాటా సెస్‌ల రూపంలో ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ విద్యుత్ బకాయిలు కేంద్రం వల్లే రాలేదని క్లారిటీ ఇచ్చారు. సీఎస్ఎస్లో కేంద్రం వల్లే నష్టపోయాం అని అన్నారు. లక్షకోట్ల కేంద్రం నుంచి రాకపోవడం వల్లే ఇబ్బంది కలిగిందని తెలిపారు. ఇవి వస్తే ఇంకో లక్ష కోట్ల అప్పు తగ్గేదని పేర్కొన్నారు. సంబంధం లేని రుణాలన్నీ చూపి 6 లక్షల కోట్ల అప్పులు తేల్చారు అని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనేది పూర్తి అబద్ధం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. లేదంటే పెట్టుబుడు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావు అని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి కూడా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి… అసెంబ్లీలో భట్టి విక్రమార్క
Telangana Assembly Sessions: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ చర్చను ప్రారంభించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పదేండ్ల కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు.
ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరారు. 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్.
ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!
During the 10 years of BRS administration, Telangana became in debt.
10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ అప్పుల పాలైయ్యింది.
“రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి”
👉 రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై… pic.twitter.com/lDr9Fa0zcs
— Congress for Telangana (@Congress4TS) December 20, 2023
Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజుకు చేరుకున్నాయి. మొదటిరోజు గవర్నర్ తీర్మానం చర్చ రోజునే సమావేశాలు వాడిగా వేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు తగ్గేదేలే అన్నట్టు మాట యుద్ధం చేసుకున్నాయి. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలన్నీ బయటకు తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే…దేనికైనా సిద్దధం అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశంలో గట్టిగానే వాగ్యుద్ధాలు జరుగుతాయని అనుకుంటున్నారు. ఈరోజు ఉదయం 11లకు ప్రారంభమయ్యే సభలో మొదటగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస రెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలియజేయనున్నారు. దీని తర్వాత సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీని వివరణ ఇవ్వనున్నారు. దీని కోసం అసెంబ్లీలో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. 2014 ఆదాయ, వ్యాయాల లెక్కలన్నీ పాయింట్ టూ పాయింట్ చెప్పనున్నారని తెలుస్తోంది. దీంతో ఈరోజు సభలో వాడిగా వేడిగా సమావేశాలు జరుగుతాయని అంచనా.
Also Read: బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
మరోవైపు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తరుఫున హరీష్ రావు లేఖ రాశారు. ఆర్ధిక, సాగునీరు, విద్యుత్ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు తమకూ కూడా ఇవ్వాలని ఆయన లేఖ లో కోరారు. కానీ ప్రభుత్వం దీనిని తిరస్కరించినట్టు తెలుస్తోంది.
CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది… కూనంనేని సంచలన వ్యాఖ్యలు!
సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయని కూనంనేని సాంబశివరావు అన్నారు.నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషనకు వెళ్లి సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని సభ్యులను కోరారు. అనంతరం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపేలా చూడాలని స్పీకర్ ను కోరారు. గత ప్రభుత్వంలో 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందని.. 2023లో కేవలం 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందని పేర్కొన్నారు.
ALSO READ: మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు