Kakinada : కాకినాడ జిల్లా(Kakinada District) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి దగ్గర జాతీయ రహదారి పై లారీ మరమ్మతులు చేసుకుంటున్న ముగ్గురి పైకి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు(RTC Super Luxury Bus) దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పైకి కూడా ఆర్టీసీ బస్సు వెళ్లడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ(Lorry) మరమ్మతులకు గురి కావడంతో ముగ్గురు సిబ్బంది లారీని బాగు చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమండ్రి(Rajahmundry) వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వేగంగా దూసుకొచ్చి లారీ పంక్చర్ వేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి మీదకి దూసుకుని వెళ్లడంతో ఆ నలుగురు స్పాట్ లోనే చనిపోయారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, రాజుగా గుర్తించారు. రాజుది ప్రత్తిపాడు కాగా..మిగిలిన ముగ్గురిది బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : ఈ సీజన్ లో 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం అంటే…!