Kakinada : కాకినాడ జిల్లా(Kakinada District) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి దగ్గర జాతీయ రహదారి పై లారీ మరమ్మతులు చేసుకుంటున్న ముగ్గురి పైకి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు(RTC Super Luxury Bus) దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పైకి కూడా ఆర్టీసీ బస్సు వెళ్లడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తిగా చదవండి..Breaking : కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
లారీ మరమ్మతులకు గురి కావడంతో రోడ్డు పక్కన నిలిపి బాగు చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తుల మీదకు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అంతేకాకుండా అదే సమయంలో అటు గా వెళ్తున్న మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Translate this News: