Vijay Sethupathi Shocking Comments On Kriti Shetty : తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో త్వరలోనే ‘మహారాజా’ (Maharaja) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ మధ్య విజయ్ సేతుపతి సినిమా కోసం కృతి శెట్టిని సెలెక్ట్ చేస్తే.. సేతుపతి ఆమెతో నటించేందుకు నో చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా.. అయితే తాజా ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
Also Read : హైదరాబాద్ లో కుబేర షూటింగ్.. వీడియో లీక్, నెట్టింట వైరల్!
అందుకే వద్దని చెప్పా…
“నేను నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్గా తీసుకుంటే చేయలేనని చెప్పా. దానికి కారణం ‘ఉప్పెన’లో ఆమెకు తండ్రిగా నటించాను. అది మంచి విజయాన్ని సాధించింది. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేను. అందుకే వద్దు అని చిత్రబృందంకు చెప్పాను. ‘ఉప్పెన’లో క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి శెట్టి కంగారు పడింది. ‘నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు’ అని ధైర్యం చెప్పాను. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు” అని చెప్పుకొచ్చాడు.