దీప్తి ఒంటిపై గాయాలు..
జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో మరణించిన దీప్తి కేసులో మిస్టరీ వీడలేదు. కీలకంగా భావిస్తున్న చెల్లెలు చందన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీప్తి మృతితో తనకు సంబంధం లేదన్న చెల్లెలి ఆడియో కలకలం రేపుతోంది. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఆక్కకు ఫోన్ చేశాడని తమ్ముడికి చందన వివరించింది. డబ్బులు, బంగారం మాయం కావటం.. దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. అనుమానస్పదంగా మృతి చెందినా.. దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా దీప్తి టీషర్ట్ కింద శరీరం కాస్త కమిలిన గాయాలు, చెంపపై గీసుకుపోయినట్లుగా ఓ చిన్న గాయం ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ చేయి విరిగి ఉంటే పక్కాగా దీప్తి హత్యకు గురైందన్న అంశానికి మరింత బలం చేకూరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చందన పోలీసుల అదుపులో ఉన్నట్లు ఊహాగానాలపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
దీప్తిది హత్యా? ఆత్మహత్యా?
కీలకంగా భావిస్తున్న చెల్లెలు చందన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చందన.. తమ్ముడు సాయికి పంపినట్టుగా భావిస్తున్న ఓ ఆడియోలో సాయి.. “నేను చందు అక్కను’.. అసలు నిజం ఏంటంటే..? దీప్తి అక్క, నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాం..!! కానీ.. నేను తాగలేదు.. అక్కనే తాగింది. నేను ‘మా ఫ్రెండ్ చేత రెండు మందు బాటిళ్లు’ తెప్పించినట్లు నేను ఒప్పుకుంటా.. కానీ నేను తాగలేదని చందు చెప్పింది. అక్క తాగి తన బాయ్ ఫ్రెండ్‌ను పిలుస్తా అంటే నేను ఒప్పు కోలేదు. అయినా పిలుస్తాను అనడంతో ఒప్పుకున్నా అని చందు ఫోన్లో సాయికి వివరించింది. ఇంట్లోంచి నేను వెళ్లిపోవాలని అనుకున్నది నిజమే కానీ అక్కకు చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. ‘మీరు అందరూ నన్ను వెయిట్ ఉన్నావని అంటుంటే బయటకు వెళ్లి ఒంటరిగా ఉండాలని అనుకున్నా.. నాకు బయట ఎక్కడా డబ్బులు లేవు అందుకే డబ్బులు తీసుకున్నా” అని ఉంది.
నేను బ్రీజర్ తాగాను..:
“నేను అక్కను ఏమీ చేయలేదే డాడీ’.. ప్లీజే..నమ్మండి నన్ను. అక్క తాగుదాం అంటేనే నా ఫ్రెండ్‌కు చెప్పి రెండు బాటిల్స్ తెప్పించాను. నేను బ్రీజర్ తాగాను. అక్క ఓడ్కా తాగింది. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు” అంటూ ప్రాధేయపడుతూ తమ్ముడికి పంపినట్టుగా ఉన్న వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. దీప్తి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు వివరాలను సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉందని, దీప్తిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం పూర్తి విచారణ తర్వాత తెలుస్తుందని సీఐ పేర్కొన్నారు.