Sitaram Echuri: నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. ఎన్నో ఎత్తులు–పల్లాలు.విద్యార్ధి దశనుంచి ప్రశ్నించే తత్వ్తం ..ఉన్నతస్థాయి చదువు.. పోరాటాలే జీవన గమనం..దేనికైనా తెగించే గుణం ఇవే సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి. ప్రముఖ భారతదేశ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ యోధుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో పార్లమెంటరీ వర్గపు నాయకుడు. విశాఖపట్నంలో జరిగిన సీపీఎం మహాసభల్లో అతను పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. సీనియర్ కామ్రేడ్ ఎస్.రామచంద్రన్ పిళ్లై పోటీ నుంచి వైదొలగటంతో సీతారాం ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అంతకుముందు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ వరుసగా మూడుసార్లు పని చేశారు.
ఈరోజు సీతారాం ఏచూరి లేరన్న విషయం చాలామందికి మింగుడు పడని విషయం. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఇందిరాగాంధీ పక్కన నిల్చుని ఉండగా ఏచూరి ఏదో చదువుతున్నారు. ఇది 1977లో తీసిన చిత్రం. అప్పట్లో ఇందిరాగాంధీ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా ఉండేవారు. అప్పుడు సీతారాం విద్యార్ధి నాయకుడుగా ఉన్నారు. ఒకరోజు విద్యార్థి బృందాన్ని వేసుకుని ఆయన ఇందిరాగాధీ ఇంటికి చేరుకున్నారు. ఆమెదగ్గరకు వెళ్ళి మాట్లాడాలనుకున్నారు. అయితే ఇందిర…తానే బయటకు వచ్చి వారదరితో మాట్లాడింది. వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. అంతలోనే సీతారాం ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామ చేయాలంటూ డిమాండ్ చదివి వినిపించారు. దాన్ని కూడా ఇందిరా స్వాగతించారు. వారి డిమాండ్ మేరకు తరువాత రాజీనామా కూడా చేశారు. ప్ర్తుతం వైరల్ అవుతున్న పిక్ ఆ సదంర్భంలోనిదే. దేశ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరున్న ఇందిర పక్కన నిల్చుని.. ఆమె రాజీనామాకే డిమాండ్ చేసిన ఆ విద్యార్థి నాయకుడే సీతారాం ఏచూరి.ఇదంతా ఎమరెజెన్సీ తర్వాత జరిగింది అప్పట్లో ఇందిరా ఎన్నకల్లో తన ప్రధాని పదవిని కోల్పోయి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసేవారు.
జేఎన్‌యూ విద్యార్థి నాయకుడుగా సీతారాం ఏచూరి యూనిర్శిటీ మీద తనదైన ముద్ర వేశారని చెబుతారు. వామపక్ష భావజాలం వ్యాప్తికి దోహదం చేశారని గుర్తు చేసుకుంటారు. ప్రకాశ్ కారత్ కలిసి ఈయన వేసిన పునాదులే ఇప్పటికీ జెఎన్యూ పై ఎస్ఎఫ్ఐ పట్టుకు కారణమని అంటారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ షేర్ చేశారు. దాంతో పాటూ ఆనాటి విషయాలన్నింటినీ గుర్తుచేశారు.
Also Read: Telangana: 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్ష