Ananya Nagalla: టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘బహిష్కరణ’. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ జూలై 19 నుంచి జీ5లో అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అనన్య ఈ సీరీస్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అనన్య మాట్లాడుతూ.. తన కో యాక్టర్ అంజలితో వర్క్ చేయడం చాలా బాగుంటుందని. సెట్స్ లో అంజలితో గేమ్స్ ఆడుతూ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లా ఉంటామని. అంజలి సెట్స్ లో ఉండడం తాను ఎంజాయ్ చేస్తానని తెలిపింది. అలాగే వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడింది అనన్య. వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో ఆద్యా సెట్స్ కి రాగానే పవన్ కళ్యాణ్ ఆమెను హాగ్ చేసుకొని దగ్గరకు తీసుకునే వారు. అది చూడగానే ఎంతో ప్రేమగా అనిపించేది. స్టార్స్ కూడా తమ పిల్లలతో సాధారణ పేరెంట్స్ వలే ఉంటారా..! అని షాక్ అయ్యేదాన్ని అని మాట్లాడింది. ఇంటర్వ్యూ లో అనన్య పంచుకున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కింది వీడియోను చూడండి.
Ananya Nagalla
Anjali: వేశ్యగా అంజలి నట విశ్వరూపం.. ‘బహిష్కరణ’ ట్రైలర్ చూశారా!
Bahishkarana Trailer: నటి అంజలి (Anjali), అనన్య నాగళ్ల (Ananya), శ్రీతేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సీరీస్ ‘బహిష్కరణ’. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ లో పుష్ప అనే వేశ్య పాత్రలో అంజలి తన విశ్వరూపాన్ని చూపించేశారు. ఈ ట్రైలర్ ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
బహిష్కరణ ట్రైలర్
మంచోడు చేసే తప్పేంటో తెలుసా.. చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకోవటం అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. జీవితంలో నిజమైన ప్రేమ, ఆనందాన్ని పొందాలనే అంజలి కోరిక తలకిందులవుతుంది. దాంతో ఆమె ప్రియుడి దారుణ హత్య పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉంటుంది అంజలి. మరో వైపు ఆ ఊరి పెద్ద, అతని మనుషులు చేసే దురాగతాలను చూపించారు. అసలు ఆ పల్లెటూరుకి అంజలి ఎందుకు ఎందుకు వచ్చింది.? అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? ఆమె ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది? అనేది ఈ వెబ్ సీరీస్ కథ. ట్రైలర్ లో ‘మంచోడు చేసే మొదటి తప్పేంటో తెలుసా’, ‘లోకంలో ప్రతి యుద్ధం స్వర్ధం తో మొదలవుతుంది’, ‘ప్రపంచమే అబద్దాల పునాదుల మీద నిలబడ్డది రా’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
Tantra OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘తంత్ర’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
Tantra Movie OTT Release: ఈ మధ్య హర్రర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా వాటి పై విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. ఇటీవలే హర్రర్ చిత్రాలుగా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’, ‘పిండం’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జానర్ లో వచ్చిన మరో హర్రర్ మూవీ ‘తంత్ర’.
Also Read: Chiranjeevi: “చూసుకోరు వెదవలు”.. వైరలవుతున్న మెగాస్టార్ కామెంట్స్..!
తంత్ర
శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నటి అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంత్ర’. క్షుద్రపూజలు, హర్రర్ ఎలిమెంట్స్ తో మార్చి 15న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పూర్తి స్థాయి హర్రర్ మూవీగా మంచి రివ్యూలు కూడా పొందింది. కథ పరంగా మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని టాక్.
తంత్ర ఓటీటీ రిలీజ్
అయితే ఇప్పటివరకు థియేటర్స్ లో భయపెట్టిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ప్రముఖ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది ఆహా. “తంత్రం మంత్రం కుతంత్రం..☠️ ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం” అంటూ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించగా.. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బీదవే( BeTheWay) ఫిల్మ్స్ బ్యానర్స్ పై రవి చైతు, నరేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తంత్రం మంత్రం కుతంత్రం..☠️
ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం!🎬#Tantra Premieres April 05 @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopisetti @RaviChaith #NareshbabuP @firstcopymovies @BeTheWayFilms @TantraTheMovie pic.twitter.com/bRJqdHUS87— ahavideoin (@ahavideoIN) March 31, 2024
Also Read: Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!
Ananya Nagalla: అనన్య పరువు తీసిన రితూ.. ఇది కూడా తెలియదా? అంటూ నెటిజన్స్ ఫైర్..!
Ananya Nagalla: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది ఈ భామ. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ‘మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల . ‘ప్లే బ్యాక్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.
Also Read: శోభనం గదిలో నిజస్వరూపం బయటపెట్టిన ముకుంద.. కోపంతో మురారి పై రెచ్చిపోయిన ఆదర్శ్..!
ప్రస్తుతం అనన్య తంత్ర అనే మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఈ బ్యూటీ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా అయిపోయింది. అయితే, తాజాగా అనన్య నాగళ్ల, రితూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోకు హాజరైంది.
ఈ ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో రితూ చౌదరి, అనన్యను ఇండియా ప్రెసిడెంట్ ఎవరని అడుగుతుంది. దాంతో, ఆమె ఓమై గాడ్ అని షాక్ అయి అక్కడున్న స్టూడెంట్స్‌ను ఆన్సర్ చెప్పమని అడుగుతుంది. వారు సమాధానం చెప్పకుండా నవ్వుతుండటంతో అనన్య ఆమె పేరు మర్చిపోయానని అంటుంది. అలాగే ఈ వీడియో వేయకండి మళ్లీ వైరల్ అయిపోతుందని సరదాగా నవ్వుతూ కామెంట్స్ చేస్తోంది. నాకు ఈ సెగ్మెంట్ ఉందని తెలియదని మాస్టర్ నేను వెళ్లిపోతాను అంటూ ఫన్నీగా అంటుంది.
View this post on Instagram
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మన ఇండియా ప్రెసిడెంట్ పేరు తెలియకపోతే ఎలా అంటూ పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. మరికొందరూ రితూ.. అనన్య పరువు తీసేసిందిగా అని కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొందరూ మాత్రి అదంతా షోలో భాగంగా జనాలను నవ్వించడానికి అనన్య- రితూ అలా చేసింటారని పోస్ట్ పెడుతున్నారు.
POTTEL Movie: అనన్య నాగళ్ళ ‘పొట్టేలు’.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్
POTTEL Movie: టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ తెలంగాణకు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి. అనన్య మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో అనన్య తన నటనకు సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంశలు అందుకుంది. మల్లేశం సినిమా అనన్యకు బాగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత అనన్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మరింత పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం అనన్య(Ananya Nagalla) సాహిత్ మోత్ఖురి దర్శకత్వంలో రాబోతున్న పొట్టేలు చిత్రంలో (Pottel Movie) నటిస్తోంది. బంధం రేగడ్’, ‘సవారీ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు సాహిత్ మోత్ఖురి. ఎన్ఐఎస్ఏ ఎంటర్టైమెంట్స్, సన్నిది క్రియేషన్స్ బ్యానర్ పై నిశాంక్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, యువ చంద్ర కృష్ణ జంటగా కనిపించనున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, జీవన్, రియాజ్, విక్రమ్, థానస్వి చౌదరి, నోయెల్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తెలంగాణ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
Also Read: KBC : రేవంత్‌రెడ్డి పై ‘KBC’ లో అబితాబ్ ప్రశ్న.. దిక్కులు చూసిన యువతి..!
తాజాగా చిత్ర బృందం సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ లో తెలంగాణ యాసలో పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ ప్రత్యేక పండుగ బోనాల వేడుకల్లో.. అమ్మవారి ముందు పొట్టేలును బలివ్వడం, జాతర విజువల్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. తెలంగాణ కల్చర్ ను (Telangana Culture) ఎక్కువగా ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
POTTEL 🔥#ananyanagalla pic.twitter.com/Oz88RZXAaZ
— Ananya Nagalla (@AnanyaNagalla) December 27, 2023