Betting apps case : నేడు పంజాగుట్ట పోలీస్​స్టేషన్​కు నటి శ్యామల..రేపు?

తెలంగాణలో బెట్టింగ్‌ యాప్స్‌ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈ రోజు యాంకర్ ​శ్యామల అధికారుల ఎదుట హాజరుకానున్నారు.

New Update
anchor shyamala,vishnu priya anchor,rithu chowdary

anchor shyamala,vishnu priya anchor,rithu chowdary

Betting apps case : తెలంగాణలో బెట్టింగ్‌ యాప్స్‌ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు సోమవారం నటి, యాంకర్ ​శ్యామల స్టేషన్​లో అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరి ఈ నెల 25న మళ్లీ ఎంక్వైరీకి రానున్నారు. యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్​ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు, విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు ఆదేశాలిచ్చింది.

Also read: SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్

దీంతో ఆమె సోమవారం విచారణకు హాజరుకానున్నారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్​ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. అటు మియాపూర్ పోలీస్​స్టేషన్​లో నమోదైన కేసులో విజయ్​దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్​రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి సహా పంజాగుట్ట పీఎస్​లో విచారణ ఎదుర్కొంటున్న 11 మందిపైనా కేసు నమోదు కాగా, ఈ ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.

Also read: Saturn: అంతరిక్షంలో అద్భుతం.. శని గ్రహం వలయాలు మాయం!

 ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు విచారించగా వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అటు మియాపూర్ కేసులో మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మధ్యవర్తులను విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినీ సెలబ్రెటీలు, స్టార్ క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు.. వీళ్లకున్న గుర్తింపుతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకోగలరు. ఎంతగా అంటే.. వాళ్లు ‘ఏది చెప్పినా.. ఏం చేసినా కరెక్ట్​’ అనుకునేంత! అలాగని ప్రజలు అమాయకులు కాదు.. కానీ, ఎంతటి విజ్ఙానవంతులైననా ఇన్​ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా వాళ్లకు ఉంటుంది. ఇది అదనుగా తీసుకున్న బెట్టింగ్ యాప్ నిర్వహకులు, వాళ్లతో ప్రమోషన్లు చేయిస్తున్నారు.  ఇదంతా పక్కన పెడితే.. వాళ్లను నమ్మి బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోయినవాళ్లు అప్పులపాలయ్యారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్టు అంచనా. ఆ అప్పులు తీర్చలేక, ఇంట్లోవాళ్లకు చెప్పుకోలేక మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు కొందరు. ఇప్పటికే ఒక్క హైదరాబాద్​లోనే దాదాపు పది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు.

Also Read: Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు