Allari Naresh Bachchala Malli Teaser Out : అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొంతున్న ఈ సినిమాకి ‘సోలో బ్రతుకే సోలో బెటర్’ మూవీ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్.. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
టీజర్ లో అల్లరి నరేష్ రగ్డ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు.. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు.. రాగము, క్రోధము, భయము పోయినవాడు.. అని మహాభారతంలో శ్రీకృష్ణుడి డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. చివరిగా ‘ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి’ అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. కాగా టీజర్ చివర్లో సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Also Read : ప్రభాస్ బావ ‘కల్కి’ చూశాను, మహాద్భుతం : మోహన్ బాబు
ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో అల్లరి నరేష్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాగార్జున నటించిన ‘నా సమిరంగా’ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించి, తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాకు కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది.