Allari Naresh: అల్లరి నరేష్ 'ఆల్కహాల్'.. లిక్కర్ లో మునిగిన పోస్టర్ వైరల్!

అల్లరి నరేష్ ఆయన  పుట్టినరోజు సందర్భంగా తన 63వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆల్కహాల్ అనే టైటిల్ ఖరారు చేశారు. 

New Update
allari naresh alcohol new project

allari naresh alcohol new project

Allari Naresh:  ఒకప్పుడు కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరినరేష్.. ఇప్పుడు  'నాంది', '12 ఏ రైల్వే కాలనీ' వంటి సీరియస్, విభిన్నమైన  కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్  లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఆయన  పుట్టినరోజు సందర్భంగా తన 63వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆల్కహాల్ అనే టైటిల్ ఖరారు చేశారు.  పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా ఒక థ్రిల్లర్ జోనర్ కి చెందినదిగా తెలుస్తోంది.   'ఫ్యామిలీ డ్రామా'  చిత్రం ఫేమ్ మెహర్ తేజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

సితార్ బ్యానర్ పై

పోస్టర్ లో అల్లరి నరేష్ మొహం  సగం మద్యంలో మునిగిపోయి సగం బయటకు కనిపిస్తూ ఉంది.  ఇది సినిమా కథ వాస్తవానికి, భ్రమకు మధ్య ఉండబోతున్నట్లు సూచిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రుహనీ శర్మ కథానాయికగా నటిస్తోంది. సితార్ బ్యానర్ నుంచి ఇటీవలే విడుదలైన మ్యాడ్ స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకూ మహారాజ్ వరుస విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో అల్లరి నరేష్ కూడా  మళ్ళీ విజయాల బాట పడతారని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. దీంతో పాటు '12 ఏ రైల్వే కాలనీ' కూడా చేస్తున్నారు.  ఇదిలా ఉంటే అల్లరి నరేష్ హీరోగా రీసెంట్ గా విడుదలైన 'ఆ ఒక్కటి అడక్కు', బచ్చలమల్లి  సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించారు. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
Advertisment
తాజా కథనాలు