Bachhala Malli: అప్పుడే ఓటీటీలోకి బచ్చలమల్లి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

అల్లరి నరేష్, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బచ్చలమల్లి'. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

New Update

బచ్చలమల్లి ఓటీటీ రిలీజ్.. 

అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ .. థియేటర్స్ లో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ  ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్స్ లో మిస్సైన వారు ఓటీటీలో ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. 

డైరెక్టర్ సుబ్బు మంగాదేవి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ ఫిమేల్ లీడ్ గా నటించగా.. హరితేజ, రావు రమేశ్, సాయి కుమార్, రోహిణి, ధన రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 

Also Read:HBD AR Rehman: సోదరి కోసం మతం మార్చుకున్న రెహ్మాన్ .. ఈ స్టోరీ మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు