Actress Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మళ్ళీ వరుస ఆఫర్స్ తో బిజీ అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ ఇతర భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు కోలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వబోతుంది.
Also Read : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘పుష్ప’ పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్నట్లు కొన్నాళ్లుగా తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్ పూర్తి చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.