Akhil Lenin: అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హీరోయిన్ గా అనౌన్స్ చేసిన శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో మరో యంగ్ బ్యూటీని రీప్లేస్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలోని కొన్ని సీన్లను మళ్ళీ రీ షూట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారట మేకర్స్.
మళ్ళీ రీ షూట్
అయితే హీరోయిన్ల మార్పే దీనికి కారణమని తెలుస్తోంది. మొదట శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేయగా.. ఆమె కొన్ని రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారని టాక్. ఈ మార్పు కారణంగా, శ్రీలీలతో గతంలో చిత్రీకరించిన అన్ని సన్నివేశాలను ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సేతో మళ్ళీ షూట్ చేయాల్సి వస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Reshoot Curse for #Akhil's Movies#AkhilAkkineni#MostEligibleBachelor#Agent#Lenin#Nagarjuna#NagarjunaAkkinenipic.twitter.com/GiKIEAVSn7
— BuzZ Basket (@theBuzZBasket) July 10, 2025
అఖిల్ చివరి సినిమా 'ఏజెంట్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్న అఖిల్ 'లెనిన్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలో ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో అఖిల్ మాస్ లుక్ లో కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.