/rtv/media/media_files/2025/05/31/JaN4p9oiVtdRRGbVZVsl.jpg)
sreeleela social media post
Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ తొలినాళ్లలోనే వరుస సినిమాలు చేస్తూ.. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఈ రూమర్లకు తెరలేపాయి.
Also Read : ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే
Did #Sreeleela's engagement take place today?
— Rajesh Manne (@rajeshmanne1) May 30, 2025
Stay Tuned for the official update! pic.twitter.com/RjQwxulyAu
ఎంగేజ్మెంట్..?
ఈ ఫొటోల్లో శ్రీలీల పెళ్లి కూతురు గెటప్ లో కనిపించడంతో పాటు కొందరు ఆమె చెంపలకు పసుపు రాయడం కనిపించింది. అంతేకాదు ఈ ఫొటోలను షేర్ చేస్తూ " నాకు ఈరోజు చాలా బిగ్ డే" అని క్యాప్షన్ పెట్టింది శ్రీలీల. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీలీలకు రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..? త్వరలోనే శ్రీలీల పెళ్లి కూడా చేసుకోబోతుందా? అని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం అది కేవలం ఒక యాడ్ షూట్ కోసం చేసింది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. శ్రీలీల పలు సార్లు కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ ఉన్నట్లు వార్తలు మొదలయ్యాయి. కార్తీక్ ఆర్యన్ శ్రీలీల జంటగా హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు తెలుగులో రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది. అలాగే తమిళ్ లో కూడా మరో రెండు ప్రాజెక్టులు సైన్ చేసినట్లు సమాచారం.
Also Read : Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం