/rtv/media/media_files/2024/12/17/6hFBNkN2e0mxJu2d5E0M.jpg)
Sreeleela: నటన, అందం, అభినయంతో కెరీర్ తొలినాళ్లలోనే వరుస అవకాశాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప2లోని 'కిస్సిక్' పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. నెక్స్ట్ కార్తిక్ ఆర్యన్ సరసన రొమాంటిక్ డ్రామాలతో బాలీవుడ్ లో సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది.
ఇద్దరు పిల్లలు..
అయితే సినిమాల్లో మాత్రమే కాదు మంచితనలోనూ తన పేరును చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. అనాథాశ్రమం నుంచి ఇద్దరు వికలాంగులైన పిల్లలను ఆమె దత్తత తీసుకున్నట్లు సమాచారం. సినిమాల్లోకి రాకముందు నుంచే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టింది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన చదువును కూడా పూర్తి చేస్తోంది శ్రీలీల. ప్రస్తుతం ఆమె MBBS ఫైనల్ ఇయర్ లో ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఇదిలా ఉంటే.. కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటూ గతకొద్ది రోజులుగా బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన IIFA అవార్డు వేడుకలో కార్తీక ఆర్యన్ తల్లి తన కాబోయే కోడలు ఎలా ఉండాలో తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. IIFA ఉత్సవాల్లో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలి గురించి ప్రశ్నించగా.. ''ఒక మంచి డాక్టర్ మా ఇంటి కోడలిగా రావాలని కోరుకుంటున్నాం'' అని తెలిపారు. అంతేకాదు అంతేకాదు రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో శ్రీలీల కూడా సందడి చేసింది. ఆ ఫంక్షన్‌లో శ్రీలీల డ్యాన్స్ చేస్తుండగా, కార్తీక్ ఆర్యన్ ఆమెను తన ఫోన్‌లో రికార్డ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో కార్తీక్ ఆర్యన్ తల్లి శ్రీలీల తన కాబోయే కోడలని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!