Actress Hema: గత కొద్దిరోజులుగా సినీ నటి హేమ బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ముందుగా రేవ్ పార్టీతో తనకేమి సంబంధం లేదని వీడియో రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత పోలీసులు బయట పెట్టిన ఆధారాలతో ఆమె ఆ పార్టీలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ విషయంలో విచారణ కోసం హేమ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో హేమా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాహింపు ఇవ్వాలని బెంగళూర్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు ఆమెకు షరతులు కూడిన బెయిల్ మంజూరు చేసింది.
”పరువు కోసం చచ్చిపోతా”
అయితే ఇటీవలే మళ్ళీ నటి హేమ రేవ్ పార్టీలో డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిందని, ఆమె పేరును బెంగళూర్ పోలీసులు ఛార్జ్ షీట్ లో చేర్చారని వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ విషయం పై తాజాగా నటి హేమ స్పందించింది. హేమ మాట్లాడుతూ.. మీడియా వాళ్ళు పాత వార్తనే మళ్ళీ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా నా చేతికి రాని ఛార్జ్ షీట్ వాళ్ళ చేతికి ఎలా వచ్చింది. ఇలాంటి వార్తలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. నాకు పాజిటివ్ వస్తే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను.. అదే నెగటివ్ వస్తే మీరు ఏం చేస్తారు. అన్ని పెద్ద పెద్ద ఛానెల్స్ నాపై వార్తలు వేస్తున్నారు. దయచేసి నాపై తప్పుడు ప్రచారాలు చేయకండి. కావాలంటే నాకు మీరే టెస్టులు చేయించండి. మీ వల్ల మా అమ్మ ఆరోగ్యం పాడైంది. నా ఫ్యామిలీ తలదించుకునే పని నేను ఎప్పుడు చేయను.. పరువు కోసం చచ్చిపోతాను అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read: This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల పండగ.. ముఖ్యంగా ఆ మూడు సినిమాలు..! – Rtvlive.com