Rave Party : నేడే నటి హేమ విచారణ.. అరెస్ట్ చేస్తారా? బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉంది. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మందిని విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. By Bhavana 27 May 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Rave Party - Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bangalore Rave Party Case) లో అరెస్టైన నిందితులతో పాటు మరికొందరి అనుమానితులను కూడా పోలీసులు ఈరోజు విచారించనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురి బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విజయవాడ వాసి అయిన లంకిపల్లి వాసు (Lankipalli Vasu) అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ ఆరుగురి అకౌంట్ల మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు న్యాయస్థానంలో సోమవారం పోలీసులు పిటిషన్ వేయనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను (Drugs) తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ (Actress Hema) కూడా ఉంది. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మందిని విచారణకు సోమవారం హాజరు కావాలని సీసీబీ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. విచారణ నేపథ్యంలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ దొరకడంతో ఆమెను అరెస్ట్ చేస్తారనే వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా ఆమె బెంగళూరులోనే ఉండి హైదరాబాద్ లో ఉన్నట్లు నమ్మించి మోసం చేసినందుకు కూడా ఆమె మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆమెను విచారణకు పిలవడంతో ఆమెను కేవలం విచారించి వదిలేస్తారా? లేక అరెస్ట్ చేస్తారా అన్న అంశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే. Also read: ఎయిర్ టర్బులెన్స్ బారినపడిన మరో విమానం..ఈసారి ఏదంటే! #investigation #bangalore-rave-party #actress-hema #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి