Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల ఆమె బెయిల్ పిటిషన్‌ను ఢీల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితకు నేడు బెయిల్ మంజూరు అవుతుందా కాదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 12 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kavitha Bail Update: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత.. శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇటీవల సుప్రీం ధర్మాసనం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కవిత పిటిషన్‌పై ఈరోజు విచారించనున్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్ దాడి..ఎక్కడంటే! ఇదిలాఉండగా.. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జులై 1న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో 50 మంది నిందితుల్లో తాను ఏకైక మహిళ అని.. ఒక తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. అయినప్పటికీ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇవే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తీహార్ జెల్లోనే ఉంటున్నారు. Also Read: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత…ఎందుకంటే! #telugu-news #mlc-kavitha #supreme-court #delhi-liquor-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి