Andhra Pradesh: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్‌ దాడి..ఎక్కడంటే!

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ పది సంవత్సరాలుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాషా అనే వ్యక్తి వేరే పెళ్లికి సిద్దమవడంతో అతని పై యాసిడ్‌ పోసి, కత్తితో దాడికి దిగింది. ఈ క్రమంలో యాసిడ్‌ వేరే మహిళ పై పడడంతో గాయాలయ్యాయి.

New Update
Andhra Pradesh: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్‌ దాడి..ఎక్కడంటే!

Acid Attack: మరికాసేపట్లో రెండు కుటుంబాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటి అవ్వాలనుకున్న ఆ జంటలోని యువకుడి మీద మరో మహిళ యాసిడ్‌ దాడికి దిగింది. నాతో పది సంవత్సరాలుగా సంసారం చేస్తూ ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతావా అంటూ తన వెంట తెచ్చుకున్న యాసిడ్, కత్తితో దాడికి దిగింది.

దీంతో పెళ్లి మండపం కాస్తా రణరంగంలా మారింది. కల్యాణ మండపంలో ఏం జరుగుతుందో తెలియక వచ్చిన బంధువులంతా షాకయ్యారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District) నందలూరులో ఆదివారం జరిగింది. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ మహిళ ఆరోపించింది.

అయితే బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ మహిళ అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి బాషా గురించి ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఆదివారం నందలూరులో అతని పెళ్లి జరుగుతుందని తెలుసుకుని నేరుగా పెళ్లి జరిగే షాదీ ఖానా వద్దకు వెళ్లింది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

దీంతో ఆమె ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ , కత్తితో బాషాపై దాడికి యత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న యువకుడి బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాటలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్‌ పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన బాషా కత్తితో ఆ మహిళ వీపు, భుజంపై బలంగా పొడవడంతో గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

Also Read: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత…ఎందుకంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు