Covishield: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

కోవీషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయనే ఆందోళన నెలకొనండతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ టీకా తీసుకున్న వారిలో మృతి చెందినవారికి, వికలాంగులుగా మారిన వారిన పరిహారం అందించాలని కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Covishield: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
New Update

Supreme Court To Hear Petition: కోవీషిల్డ్ వ్యాక్సిన్ (Covishield Vaccine) తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయనే దానిపై ప్రస్తుతం ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. బ్రిటన్‌లోని ఆస్ట్రాజెనికా (AstraZeneca) అనే కంపెనీ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి తయారు చేసిన వ్యాక్సిన్‌ను.. మన దేశంలో సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అనే కంపెనీ కోవిషీల్డ్‌తో విక్రయించింది. అంతేకాదు పలు దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేసింది.

Also Read: పరీక్షసెంటర్‌లో మారిన నీట్‌ పేపర్‌.. ఆందోళనలో విద్యార్థులు

అయితే ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో సైఢ్‌ ఎఫెక్ట్స్‌కు గురైన కొందరు యూకే హైకోర్టులో ఆ కంపెనీపై పిటిషన్ వేశారు. దీంతో తమ వ్యాక్సిన్ తీసుకున్న వారు చాలా అరుదుగా థ్రాంబోసిస్‌ విత్‌ థ్రాంబోసిటోపెనియా సిండ్రిమ్ (TTS) అనే పరిస్థితికి గురవుతున్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ.. కోర్టులో అంగీకరించింది. ఈ టీటీఎస్ కండీషన్ వల్ల రక్త గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోవడం లాంటి పరిస్థితులకు దారి తీస్తాయని తెలిపింది.

మరోవైపు మనదేశంలో కూడా కోవిషీల్డ్ తీసుకున్నవాళ్లలో కొందరు గుండెపోటుతో మృతి చెందినట్లు అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఇది తీసుకున్న తర్వాత మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించాలని పిటిషనర్‌ కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న తీసుకున్న వాళ్లలో కొందరు వికాలాంగులుగా కూడా మారారని.. వాళ్లకు కూడా పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్‌ సోమవారం అంగీకరించారు. అయితే విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదు.

Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

#telugu-news #national-news #covid-19 #covishield #astrazeneca
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe