కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షపై గందరగోళం నెలకొంది. సెలెక్ట్ చేసిన పరీక్ష పేపర్‌కు బదులుగా నిర్వాహకులు విద్యార్థులకు మరో పేపర్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన నీట్ పరీక్ష కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష పేపర్ ఒకటైతే.. కేవలం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో మాత్రం వేరే పరీక్ష పేపర్ ఇచ్చారు. పేపర్ మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
పూర్తిగా చదవండి..Telangana: పరీక్షసెంటర్లో మారిన నీట్ పేపర్.. ఆందోళనలో విద్యార్థులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్‌లో N6 NANGU అనే పేపర్ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
Translate this News: