World cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్.

ప్రపంచకప్ సమరం మొదలైంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది. మరో రెండు రోజుల్లో ఆతిధ్య జట్టు టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కానీ తొలి మ్యచ్‌లోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది.

New Update
World cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్.

Shubman Gill: మొదటి మ్యాచ్ కు ముందే భారత్ కు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ 8, ఆదివారం అంటే మరో రెండు రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో (World Cup 2023) తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతుంది టీమ్ ఇండియా. అయితే మ్యాచ్ ఇంకా రెండు రోజులు ఉంది అనగా టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్ తెలిసింది. భారత స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. అతనికి డెంగ్యూ పాజిటివ్ అని రిపోర్ట్‌లలో తేలింది. దీనివలన ఇతను ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది.

శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈరోజు మరోసారి అతనికి రక్త పరీక్షలు చేయనున్నారు. దానిని బట్టి మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి. శుభ్‌మన్ భారత్ కు మంచి ఓపెనర్. ఇతని దూకుడు ఆటతో ప్రారంభం నుంచే పరుగులు రాబడుతాడు. ఆసియా కప్‌లో (Asia Cup), ఆస్ట్రేలియాతో వన్డే సీరీస్‌లో కూడా గిల్ అదరగొట్టాడు. ఇతను మ్యాచ్ కు దూరమవ్వడం టీమ్ ఇండియాకు లాస్ అనే చెప్పాలి.శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు కనుక దూరం అయితే అతని స్థానంలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఓపెనర్‌గా దిగే అవకాశం ఉంది. అయితే గిల్ ఆరోగ్యం గురించి బీసీసీఐ ఇంకా ఏమీ ధృవీకరించలేదు.

ఇక నిన్నటి మ్యాచ్లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఏకంగా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 36.2ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్‌ చేసింది. రచిన్‌ రవీంద్రతో పాటు డెవన్‌ కాన్వే సెంచరీలతో వీరవీహారం చేయడంతో కివీస్‌ ఈజీగా గెలిచేసింది.

టార్గెట్‌ ఛేజింగ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ మొదటి బంతికే డకౌట్ అయినా కాన్వేతో పాటు రచీన్ రవీంద్ర సెంచరీలతో దుమ్మురేపారు. కాన్వే 121 బంతుల్లో 152 రన్స్‌తో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఏకంగా 19 ఫోర్లు ఉన్నాయి. 3 సిక్సులు కూడా బాదాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రచీన్ రవీంద్ర 96 బాల్స్‌లో 123 పరుగులతో రెచ్చిపోయి ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం రచీన్ రవీంద్ర గురించే చర్చించుకుంటోంది. రచీన్‌ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఇంగ్లండ్‌ బౌలర్లలో శామ్‌ కర్రాన్‌ కేవలం ఒక్క వికెట్ తీశాడు.

Also Read: ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చిచెండాడిన కివీస్‌ బ్యాటర్లు.. ఫస్ట్ విక్టరీ న్యూజిలాండ్‌దే!

Advertisment
తాజా కథనాలు