Viral Video : "దేవుడా నన్ను రక్షించు"...లిఫ్ట్‎లో ఇరుక్కొని..20 నిమిషాలు చిన్నారి నరకయాతన..!!

గతకొంతకాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో లిఫ్ట్ పనిచేయకపోవడం కేసులు పెరుగుతున్నాయి. ఈ ఘటనల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాలపాటు అందులో నరకయాతన అనుభవించింది. ఈ సమయంలో చిన్నారి తనను రక్షించమంటూ కేకలు వేసింది. అంతేకాదు ధైర్యంతో లిఫ్ట్ డోర్లను తెరిచే ప్రయత్నం కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update

ఇది కూడా చదవండి: భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం..ఖగోళం బద్ధలవుతుందా?…నాసా ఏం చెబుతోంది..?

నగరాల్లో అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగింది. అందులో నివాసం ఉండేవారికోసం నిర్వాహకులు లిఫ్టును ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిర్వహణ లోపం వల్ల లిఫ్టులకు సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, ముందుగానే తలుపులు తెరచుకోవడం..అందులోనే ఇరుక్కుపోవడం వంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన చిన్నారి 20 నిమిషాలపాటు నరకయాతన అనుభవించింది. చిన్నారి తనను తాను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. తాను ఎంత ప్రయత్నించినా లిఫ్ట్ తలపులు తెరచుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు చూస్తే...లక్నోలోని కుర్సీలో జనేశ్వర్ ఎన్ క్లేవ్ లోని బి 1105 ఫ్లాట్ లో నివాసం ఉంటున్న ధ్వని అవస్థి అనే చిన్నారి బుధవారం లిఫ్ట్ లోకి వెళ్లింది. అయితే ఆ చిన్నారి లిఫ్ట్ లోకి ఎక్కిన మరుక్షణమే కరెంటు పోయింది. దీంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో చిన్నారి ఒంటరిగా ఉండటంతో భయాందోళనకు గురైంది. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా తలుపును తెరిచే ప్రయత్నం చేసింది. తలుపులు ఎంతకూ తెరచుకోకపోవడంతో...గట్టిగా అరవడం, ఏడవడం మొదలుపెట్టింది. లిఫ్ట్ లో సీసీ కెమెరా ఉన్న సంగతి చిన్నారికి తెలుసు. ఆ కెమెరాను చూస్తూ దేవుడిని వేడుకుంది. చేతులు జోడించి దేవుడా ఎలాగైనా నన్ను రక్షించు అంటూ ప్రార్థించింది. ఇలా 20 నిమిషాల పాటు లిఫ్టులో ఉంది. ఆ తర్వాత కరెంటు రావడంతో చిన్నారి సురక్షితంగా బయటకు వచ్చింది.

ఇది కూడా చదవండి: విశాల్ ఆరోపణతో సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం..ఏంటంటే.!!

Advertisment
Advertisment
తాజా కథనాలు