జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE | Speed News | AP TS BUSINESS NATIONAL SPORTS | RTV
పొట్టి ప్రపంచకప్ కు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు వివాదంలో చిక్కుకుంది. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల్లో కేవలం ఒక నల్లజాతి వ్యక్తి కే ప్లేస్ దక్కింది.దీంతో ఆదేశంలో ప్రస్తుతం ఈ విషయమై వివాదం చెలరేగింది.
గతకొంతకాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో లిఫ్ట్ పనిచేయకపోవడం కేసులు పెరుగుతున్నాయి. ఈ ఘటనల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాలపాటు అందులో నరకయాతన అనుభవించింది. ఈ సమయంలో చిన్నారి తనను రక్షించమంటూ కేకలు వేసింది. అంతేకాదు ధైర్యంతో లిఫ్ట్ డోర్లను తెరిచే ప్రయత్నం కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.