Stock Market Today: దేశీయ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో కొనసాగుతున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి (RBI monetary policy) విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యలో సూచీలు ఉత్సాహంగా కదులుతున్నాయి. ప్రారంభంలోనే 405 పాయింట్లతో లాభంతో 65,631 దగ్గర,నిఫ్టీ (Nifty) 59 పాయింట్ల లాభంతో 19,605 దగ్గర ముందుకు కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 షేర్లలో టైటన్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, బజాజ్ ఫెనాన్స్, ఇండస్‌ఇండ్, విప్పో, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్ట్లే, మెచ్యూఎల్, ఎల్అండ్టీ, బారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టలతో ముగిసాయి. ఇక ఐరోపా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే స్థిరపడ్డాచి.
పాత వడ్డీ రేట్లే...ప్రకటించిన ఆర్బీఐ
అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్ల మీద ఆర్బీఐ (RBI Interest Rate) తన నిర్ణయాన్ని ప్రకటించింది. వడ్డీ కేలక రేట్లను యథాతథంగానే కొనసాగిస్తామని చెప్పింది. రెపో రేటు (Repo Rate) ను 6.5 శాతం దగ్గర కొనసాగిస్తామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) తెలిపారు. ఎంఎసంఎఫ్, బ్యాంక్ రేట్ కూడా 6.75శాతం దగ్గర స్ధిరంగా ఉండనున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచడం వరుసగా ఇది నాలుగోసారి. వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచాలని పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు శక్తికాంత్ చెప్పారు. గత ఆగస్టుతో పోల్చుకుంటే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగిందని...దాన్ని గమనిస్తూ పరిధదిలోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. అలాగే సెప్టెంబర్ లో ద్రవ్యోల్బణం దిగివచ్చే అవకాశాలున్నాయిని అంచనా వేశారు. ప్రవైటు రంగాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. దీనివల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా మారుతుందని అన్నారు.
Also Read: భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోష్..ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!!
పెట్రోలు-డీజిల్ కొత్త ధరలు ఇవే..మీ నగరంలో పెరిగిందో…తగ్గిందో..ఓ సారి చెక్ చేసుకోండి…!!