Stock market: వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది.

New Update
Stock Market Today: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ (NSE) సూచీ ప్రకారం..నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు కోల్పోయి 19,436 పాయింట్ల వద్ద స్థిరంగా ఉంది.

ఒకానొక సమయంలో సెన్సెక్స్‌ 400 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి. అయితే మార్కెట్‌ కొద్ది గంటల్లో ముగుస్తుంది అనగా కొనుగోళ్లు జరగడంతో మార్కెట్‌ కాస్త మెరుగుపడింది. దీంతో కొంత మేర నష్టాలను తగ్గించుకున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాలతో నెల రోజుల కనిష్టాలకు చేరుకున్నాయి.

ఉదయం సమయంలోనే మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అయితే చివరి గంటలో మదపర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో నష్టాలు కొంచెం తగ్గాయి. బీఎస్‌ఈలో అన్ని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ బుధవారం రోజే రూ. 2.49 లక్షల కోట్లు తగ్గి రూ. 316 .72 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో వడ్డీ రేట్లు ప్రభావం ఎక్కువ కాలం ఉండే అవకాశాలున్నాయి.

నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, ఇండస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్‌ షేర్లు నష్టాలను చూశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, నెస్లీ ఇండియా, హెచ్ యూఎల్ , ఈచర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాలను చూశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మెటల్, రియల్టీ సూచీలు ఒకటి నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి.

బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 1.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 1 శాతం మేర నష్టపోయాయి.సెక్టార్ల పరంగా చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు క్షీణత నమోదు చేశాయి. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా ఉంది. మార్కెట్ ముగిసే సమయానికి రూ. 83.24 వద్ద సెటిల్ అయింది. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి మారకం విలువ రూ. 83.22 గా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.2500 తగ్గిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు