/rtv/media/media_files/2025/03/13/Dz6uVz7Lr2Y1JFb0kRtK.jpg)
Mahvash Photograph: (Mahvash )
టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్ డేటింగ్‌లో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చాహల్‌తో కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇన్‌డైరెక్ట్‌గా దీనిపై మహ్‌వశ్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మహ్‌వశ్‌కు బెస్ట్ మెగా ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డు వచ్చింది. ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ.. ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్‌వశ్ ఎంతో గర్వపడుతుందని, ఇది ఎంతో ప్రత్యేకమైన విషయమని తెలిపింది. ఏ తప్పు లేకుండా, ఎలాంటి అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని చేస్తూ ముందుకు వెళ్లాలని పోస్ట్ పెట్టింది. దీంతో డేటింగ్ రూమర్స్‌పైనే ఈ పోస్ట్ పెట్టినట్లు పలువురు భావిస్తారు.
ఇది కూడా చూడండి:గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్
Rj mahvash clarification on rumours about her and chahal's relationship pic.twitter.com/AW86QXG1Ed
— 100rav (@Saurav6394) March 11, 2025
ఇది కూడా చూడండి:Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో..
దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను సపోర్ట్ చేస్తూ చాహల్ మరో అమ్మాయితో స్టేడియంలో కనిపించాడు. ఇటీవల ధన శ్రీ వర్మతో విడాకులు తీసుకున్న చాహల్ మరో అమ్మయితో కనిపించడంతో వైరల్‌గా మారింది. అయితే వీరిద్దరి కలిసి కన్పించడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది డిసెంబరులో కూడా చాహల్‌తో కలిసి దిగి ఓ ఫొటోను మహ్‌వశ్ షేర్ చేసింది. అప్పట్ల కూడా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె వాటిని తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమని, తప్పుడు కథనాలని సృష్టించకూడదని తెలిపింది.
ఇది కూడా చూడండి:బిగ్ షాక్ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !