/rtv/media/media_files/2025/02/03/N4njSjQxQFcdDCysecX1.jpg)
yuvvaraj Photograph: (yuvvaraj)
Yuvaraj singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌పై ప్రశంసలు కురిపించాడు. సచిన్‌ను బీసీసీఐ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించిన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టాడు. ప్రపంచంలోని ప్రతి క్రికెటర్‌కు మీరే స్ఫూర్తి అంటూ తెగ పొగిడేశాడు.
నాకేంతో గర్వకారణం..
ఈ మేరకు శనివారం ముంబై వేదికగా బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఇండియా క్రికెట్‌కు అందించిన సేవలకుగాను ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించారు. దీనిని పురష్కరించుకుని పోస్ట్ పెట్టిన యువీ.. ‘కంగ్రాట్స్ లిటిట్ మాస్టర్. CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు. ప్రపంచలోని ప్రతి క్రికెటర్ కు మీరే స్ఫూర్తి. కేవలం ఆటలో మాత్రమే కాదు జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపించారు. క్రమశిక్షణతో కూడిన శ్రమతో కలలను నిజం చేసుకోవాలని, పట్టుదల, నమ్మకంతోనే కలలు సాకారం అవుతాయని మాకు చూపించారు. మీతో కలిసి ఆడటం నాకేంతో గర్వకారణం. మీ పట్ల ఇదే ప్రేమ, గౌరవం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది’ అంటూ తనదైన స్టైల్ లో కొనియాడాడు యువీ.
/rtv/media/media_files/2025/02/03/rF4G2OlvdJ7vyhOXcD5I.jpg)
ఇది కూడా చదవండి: Sonusood : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఎందుకంటే!
1989 నుంచి 2013 వరకు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన సచిన్.. 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ప్రపంచ క్రికెట్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ గా రికార్డ్ సృష్టించారు. అంతేకాదు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ కూడా సచినే. అత్యధిక టెస్టులు 200 ఆడిండికూడా ఈ మాస్టర్ బ్లాస్టరే.